![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -287 లో.....దశరథ్ కి దాస్ కాల్ చేసి.. త్వరగా రా అన్నయ్య నేనొక నిజం చెప్పాలనగానే.. నేను వస్తున్నానంటూ దశరథ్ హడావిడి గా వెళ్తుంటాడు. అదంతా జ్యోత్స్న విని ఇప్పుడు దాస్ నిజం చెప్తే నా పరిస్థితి ఏంటి? నిజం చెప్పకుండా ఆపాలని జ్యోత్స్న అనుకొని దశరథ్ వెనకాలే వెళ్తుంది. దశరథ్ దాస్ దగ్గరికి వెళ్లి ఏంటి రా ఏదో చెప్పాలి అనుకుంటున్నావని అడుగుతాడు. జ్యోత్స్న నన్ను చంపాలి అనుకుందని దాస్ చెప్తాడు. ఎందుకు చంపాలనుకుంది అని దశరథ్ అడుగగా.. జ్యోత్స్న నీ కూతురని అంటుండగా అక్కడే ఉన్న జ్యోత్స్న కిటికీ దగ్గర నుండి ఏదో పడేస్తుంది. ఆ శబ్దం విని మళ్ళీ దాస్ అంత మర్చిపోతాడు.
ఆ శబ్దం చేసింది ఎవరని దశరథ్ కిటికీ దగ్గరికి వెళ్లి చూస్తాడు. జ్యోత్స్న వెళ్తూ కన్పిస్తుంది. దాస్ దగ్గరికి వచ్చి ఏంటి ఆ నిజమని అడుగుతాడు. ఈ నిజం అంటూ దాస్ పడుకుంటాడు. అప్పుడే కార్తీక్, కాశీ లు వచ్చి ఏదో శబ్దం అయిన ప్రతిసారి ఇలాగే అయిపోతున్నాడని కార్తీక్ అంటాడు. అంటే ఇలా అవుతాడని జ్యోత్స్నకి తెలిసే శబ్దం చేసిందా అని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స ఇంటికి టెన్షన్ గా వెళ్తుంది. అప్పుడే పారిజాతం వచ్చి ఎక్కడికి వెళ్ళావ్ అంటుంది. ఫ్రెండ్ దగ్గరికి అని జ్యోత్స్న అంటుంది. ఏంటి చెవి కమ్మ ఒక్కటే ఉందని పారిజాతం అంటుంది. దాంతో ఇంకొకటి ఏది అంటూ జ్యోత్స్న టెన్షన్ పడుతుంది.ఆ తర్వాత స్వప్న వచ్చి భోజనం చెయ్యండి మావయ్య అని దశరథ్ తో అనగానే.. సరే అని అంటాడు. కార్తీక్, కాశీ, దశరథ్ లు ముగ్గురు కలిసి భోజనం చేస్తూ సరదాగా మాట్లాడుకుంటారు.
కార్తీక్ ఇంటికి వెళ్లేసరికి.. శౌర్యపై దీప కోప్పడుతుంది. పక్కింట్లో అన్నం తింటుందని శౌర్య గురించి కార్తీక్ కి చెప్తుంది దీప. కార్తీక్ బాబు చూసావా ఎంత ఆకలిగా ఉన్నా కూడా ఇంట్లో తప్ప ఎక్కడ తినరని కార్తీక్ గురించి అంటుంటే.. కార్తీక్ కొంచెం ఇబ్బంది పడతాడు. ఎందుకు అంటే స్వప్న వాళ్ళింట్లో కార్తీక్ తినేసి వచ్చాడు. దీప భోజనం పెడుతుంటే కార్తీక్ ఆల్రెడీ తినేసా అని చెప్పలేక తన ప్లేట్ లోని భోజనం శౌర్య చూడకముందు తన ప్లేట్ లో వేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |